రామ్ పోతినేని నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూక’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఉపేంద్ర ఇందులో ఆన్‌స్క్రీన్ సూపర్‌స్టార్‌గా కనిపించబోతున్నారు. మహేశ్‌బాబు.పి దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 28న సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మూడో పాటను ఈ నెల 31న విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. ‘చిన్ని గుండెలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. రామ్, భాగ్యశ్రీ బోర్సేల అందమైన కెమిస్ట్రీని ఈ పోస్టర్లో చూడొచ్చు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: వివేక్ అండ్ మెర్విన్, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టి.సిరీస్ ఫిల్మ్స్.