Bhagyashree Borse | ‘ఆషికీ 2’ హీరోతో రొమాన్స్.. బాలీవుడ్‌కి భాగ్యశ్రీ భోర్సే!
Aditya Roy Kapur | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి భాగ్యశ్రీ భోర్సే బాలీవుడ్లో జాక్‌పాట్ కొట్టారు. ‘ఆషికీ 2’ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె కథానాయకిగా నటించేందుకు రంగం సిద్ధమైంది.
Bhagyashree Borse | దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి భాగ్యశ్రీ భోర్సే బాలీవుడ్లో జాక్‌పాట్ కొట్టారు. ‘ఆషికీ 2’ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ సరసన ఆమె కథానాయకిగా నటించేందుకు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మిలప్ జవేరి తెరకెక్కించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత నెలలో అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం, పూర్తి స్థాయి ఇంటెన్స్, వయొలెంట్ అండ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మిలప్ జవేరి తనదైన శైలిలో హై-పిచ్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను మలచనున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ ఎమోషనల్ అండ్ లేయర్డ్ ఉన్న వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా భాగ్యశ్రీ భోర్సేను ఖరారు చేశారని, త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై 2027లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
భాగ్యశ్రీ సినీ కెరీర్లో ఈ ప్రాజెక్ట్ ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. గత కొద్దికాలంగా ఆమె సౌత్ ఇండస్ట్రీలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘కింగ్ డమ్’, అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘కాంత’, ఇటీవల అఖిల్‌తో కలిసి లెనిన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. హిందీలో ఇంతకుముందు కొన్ని చిన్న పాత్రలు చేసినప్పటికీ, ఇప్పుడు ఏకంగా టి-సిరీస్ లాంటి దిగ్గజ బ్యానర్లో, ఓ స్టార్ హీరో సరసన లీడ్ రోల్ చేయడం ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

