Bhagyaraj | వెంకటేష్‌కి సూపర్ హిట్స్ అందించిన భాగ్యరాజ్.. ఆ మూడు హిట్స్ వెనక ఆయన పాత్ర ఏంటి?
Bhagyaraj | ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) ఉదయం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమను కూడా విషాదంలో ముంచెత్తింది.దాదాపు ఐదు దశాబ్దాలపాటు సినీ రంగంలో విశేష సేవలందించిన కె. భాగ్యరాజ్ తన రచన, దర్శకత్వం, నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
Bhagyaraj | ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) ఉదయం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమను కూడా విషాదంలో ముంచెత్తింది.దాదాపు ఐదు దశాబ్దాలపాటు సినీ రంగంలో విశేష సేవలందించిన కె. భాగ్యరాజ్ తన రచన, దర్శకత్వం, నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ మరో ప్రముఖ దర్శకుడు భారతీరాజాను కోల్పోగా, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో సినీ దిగ్గజాన్ని కోల్పోవడం తమిళ సినీ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
భాగ్యరాజ్‌ను భారతీయ సినీ పరిశ్రమలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే’గా అభిమానులు, సినీ విమర్శకులు అభివర్ణిస్తుంటారు. కుటుంబ కథలు, హాస్యం, ప్రేమ, సామాజిక అంశాలను కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను రూపొందించడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉండేది. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను సహజంగా తెరపై ఆవిష్కరించడం, సరదా సంభాషణలు, భావోద్వేగపూరిత కథనాలతో ఆయన చిత్రాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. 1979లో విడుదలైన ‘సువరిల్లాద చిత్రంగల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భాగ్యరాజ్, తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుల జాబితాలో చేరారు.
కె. భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యారు. ఆయన కథల ఆధారంగా అనేక తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు. ‘అబ్బాయిగారు’ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. ఆయన రచనా శైలి, కుటుంబ కథలను చెప్పే తీరు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భాగ్యరాజ్ విశేష గుర్తింపు పొందారు. దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తన చిత్రాల్లో సాధారణ మనిషి పాత్రలను పోషిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు. కె. భాగ్యరాజ్‌కి పూర్ణిమ భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శాంతను భాగ్యరాజ్ ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

