Balakrishna | బాలయ్య కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. పదేళ్ల కింద వరకు బాలయ్య సినిమాలు రూ.50 కోట్ల మార్క్ టచ్ చేసిన దాఖలాలే లేవు. అలాంటిది ఇప్పుడు వంద కోట్లు కూడా సునాయసంగా కొట్టేస్తున్నాడు. ఇక మార్కెట్ పరంగానూ బాలయ్య క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి సినిమాకు ఏకంగా వంద కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. పైగా బాలయ్య తన ఏజ్‌కు తగ్గ పాత్ర పోషించనుండటంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. దసరా డేట్‌ను లాక్ చేసుకున్న ఈ సినిమా అదే స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేస్తున్నారట.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌నే కాదు సగటు సినీ ప్రేమికుడుని కూడా ఎగ్జైట్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ ఊర మాస్ బీట్‌ను ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్‌ను కూడా రూపొందించారట. ఈ పాటలో బాలయ్యతో కలిసి కాజల్, శ్రీలీల కూడా చిందులేయనున్నారట. అంతేకాకుండా ఇప్పటివరకు వచ్చిన మాస్ బీట్ సాంగ్‌లను కొట్టేవిధంగా ఈ పాట ఉండనుందట. అంతేకాకుండా దంచవే మేనత్త కూతురు బిట్‌ను కూడా ఈ పాటలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తుంది. బాలయ్యతో మాస్ సాంగ్.. అది కూడా కాజల్, శ్రీలీలతో అంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.