ధర్మ, ఐశ్వర్య జంటగా నటిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలోని ‘బాగి బాగి..’ అనే లిరికల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. శ్రీవసంత్ స్వరపరచిన ఈ గీతాన్ని చంద్రబోస్ రచించగా, జావెద్ అలీ ఆలపించారు. ‘సర్రంటు కరెంట్ షాక్ కొట్టినట్లు, నరాలు గుర్రాలై దౌడు తీసినట్లు, బుర్రంత గిర్రంటు సుట్టు తిరిగినట్టు..కిర్రాకు లవ్వు పుట్టినట్టు బాగి బాగి సూడరాదే కొంచెం ఆగి..’ అంటూ యూత్‌ఫుల్‌గా ఈ పాట సాగింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర బృందం పేర్కొంది. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, రచన-దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి.