Bhagavanth Kesari Movie Release Date | నరికినా కొద్ది నీకు ఆయసం వస్తుందేమో.. నాకు ఊపొస్తుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అయనకే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏజ్ అయిన కొద్ది మరింత ఊపుతో బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. పైగా తన ఏజ్ తగ్గ పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. ఒకప్పుడు యాభై కోట్ల మార్క్ టచ్ చేయడానికి నానా కష్టాలు పడే బాలయ్య ఇప్పుడు తొలిరోజే యాభై కోట్ల రేంజ్లో వసూళ్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి అనే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ వీర లెవల్లో ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. చేతిలో రెండు పవర్ ఫుల్ గన్స్ పట్టుకుని ప్రత్యర్ధులను మట్టు పెడుతున్నట్లు పోస్టర్ అరాచకంగా ఉంది. ఇక అదే రోజున విజయ్ దళపతి లియో రిలీజ్ కానుంది. ఈ లెక్కన లియోకు గట్టి పోటీ ఎదురుపడ్డట్లే. పైగా ఈ సినిమాను సితార సంస్థ ఏకంగా రూ.21 కోట్ల రేంజ్లో హక్కులను కొనుగోలు చేశాడు. సోలోగా రిలీజయ్యుంటే తొలిరోజు పాతిక శాతం అయినా రికవరీ అయ్యేది. ఇక ఇప్పుడు అదే రోజు వస్తుండటంతే లియోకు పెద్ద దెబ్బ పడ్డట్లే.
పైగా బాలయ్య క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న వీరసింహా రెడ్డి సినిమానే తొలిరోజు యాభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిందంటే.. ఈ సినిమాకు మినిమం పాజిటీక్ టాక్ వచ్చినా వసూళ్ల వర్షం ఖాయం. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపించనుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥#Bhagavanthkesari Grand Worldwide Release on October 19th, 2023💥#BhagavanthKesariOnOCT19
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @JungleeMusicSTH @sahugarapati7… pic.twitter.com/2uAeo5wWRH
— Shine Screens (@Shine_Screens) July 22, 2023