ChinaPiece | యూనిక్ స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ‘చైనా పీస్’ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ‘భగ భగ’ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, తన వైవిధ్యమైన కాన్సెప్ట్, యాక్షన్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు వచ్చిన ఈ పాట దేశభక్తి స్ఫూర్తిని రగిలిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ పాటకు పవర్ఫుల్ ట్యూన్ అందించగా, కాల భైరవ తన అద్భుతమైన వాయిస్‌తో ఈ గీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. రెహమాన్ అందించిన ఉత్తేజకరమైన సాహిత్యం అందరినీ హత్తుకుంటోంది.
కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సురేష్ రగుతు కెమెరా పనితనం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ స్పై డ్రామాకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం, సరికొత్త స్పై జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా మారుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.