వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నోబడీ’ ఉపశీర్షిక. ‘పేపర్‌బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకుడు. శనివారం ఈ సినిమా నుంచి ‘భగ భగ..’ అనే లిరికల్సాంగ్ను విడుదల చేశారు. అనూప్‌రూబెన్స్ స్వరపరచిన ఈ పాటను వనమాలి రచించారు. ‘మనిషేనా నువ్వు, ఏమై పోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటి దగా..’ అంటూ మనిషిలోని క్రూరత్వాన్ని ప్రశ్నిస్తూ సాగిందీ పాట. అరిషడ్వర్గాలను మనిషి ఎలా జయించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు, సమర్పణ: ఆర్వీ రెడ్డి, రచన-దర్శకత్వం: జయశంకర్.