Bhaag Saale Movie New Trailer | మత్తు వదలరా వంటి వినూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ(Sri Simha). యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం ‘భాగ్ సాలే’ (Bhaag Saale). ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మంచి అంచనాలనే పెంచాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి కూత ర్యాంప్ (Kootha Ramp) ట్రైలర్ అంటూ కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
మొదటి ట్రైలర్లో ‘కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం. ‘క్వీన్ పోయి కింగ్ ఏడుస్తుంటే.. ఉంచుకొన్నదొచ్చి రింగ్ అడిగిందంట’ అనే డైలాగ్స్‌తో అలరించగా.. ఈ కూత ర్యాంప్ ట్రైలర్ మరింత నవ్వులు పంచేలాగా ఉంది. కాగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. సింహకు జోడీగా నేహ సోలంకి నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బెన్ సినిమా, సినీ వాల్లే మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.