హర్షవర్ధన్, నిహారిక జంటగా స్వీయ దర్శకనిర్మాణంలో జి. అంజనీప్రసాద్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బేవార్స్ గాడు’. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో దర్శకనిర్మాత జి. అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ ‘తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించాలనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తీశాం. అరవైశాతం షూటింగ్ పూర్తయింది.
చివరి షెడ్యూల్‌ను జూన్ 9 నుంచి మొదలుపెడతాం. కీలక పాత్రలో సుమన్ నటిస్తున్నారు’ అన్నారు. చిన్న సినిమా అయినా మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించారని టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్లాల్ రాజు, సంగీతం: రాము.