Daggubati Raana | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటుడు దగ్గుబాటి రానా
Daggubati Raana | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు నటుడు దగ్గుబాటి రానా.
Daggubati Raana | బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు నటుడు దగ్గుబాటి రానా (Raana). ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ రానా,
పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు పంపింది. ఈ నోటీసులలో భాగంగా ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఈ విచారణలో భాగంగా తాజాగా రానా కూడా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

