Bellamkonda Sai Srinivas | టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఇప్పటికే టైసన్ నాయుడు (Tyson Naidu)తో పాటు #BSS11 ప్రాజెక్ట్ చేస్తున్న బెల్లంకొండ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
అల్లరి నరేష్‌కి నాంది లాంటి సూపర్ హిట్ చిత్రంను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు భైరవం అనే టైటిల్ పెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. సాక్ష్యం తర్వాత బెల్లం బాబు మళ్లీ సోషియో ఫాంటసీ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కే.కే రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘గరుడన్’ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తుంది. స్నేహం, నమ్మక ద్రోహం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది.
Prod No. 16 of @SriSathyaSaiArt by @DirVijayK & team is #BHAIRAVAM 🔱
Presenting @BSaiSreenivas in a never seen rugged avatar as ‘SEENU’ from the massy world of #Bhairavam @HeroManoj1 @IamRohithNara @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala @Brahmakadali… pic.twitter.com/2LzkL8PYf6
— Vamsi Kaka (@vamsikaka) November 4, 2024
ఇవే కాకుండా బెల్లంకొండ నటిస్తున్న టైసన్ నాయుడు సినిమా విషయానికి వస్తే.. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే సీరియస్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
#BSS11 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నాడు. హారర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించబోతుంది. ఇక ఈ మూవీ లాంచ్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.