హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న హారర్ మిస్టరీ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. మైథాలజీ గ్రాండియర్నీ, ఓ మిస్టరీని ఈ టైటిల్ సూచిస్తున్నది.
బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌లు చేతిలో టార్చ్‌లు పట్టుకొని అడవిలో ఏదో వెతుకుతూ.. ఎక్సయిటింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోస్టర్లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్లో కనిపిస్తున్న పాడుబడ్డ బంగ్లా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ నెల 29న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: సామ్ సిఎస్, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్.