ప్రస్తుతం నాలుగు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వాణిజ్య పంథాలోనే వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటున్నానని, ప్రతీ సినిమాలో నటుడిగా కొత్తదనాన్ని చూపించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన మంచు మనోజ్, నారా రోహిత్‌తో కలిసి నటించిన తాజా చిత్రం ‘భైరవం’ ఈ నెల 30న విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు..