Chatrapathi | యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకుడు. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ నిర్మిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘ఛత్రపతి’ రీమేక్ ఇది. మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ శక్తివంతంగా కనిపిస్తున్నారు.
The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥
Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023
‘ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసాంఘిక శక్తులపై ఆయన సాగించిన సమరం ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్రగుప్తా, శివం పాటిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : విజయేంద్రప్రసాద్, కెమెరా: నిజార్ అలీ షఫీ, సంభాషణలు: మయూర్ పూరి, సంగీతం: తనిష్క్ బాగ్చి, దర్శకత్వం: వి.వి.వినాయక్.