Bhairavam Telugu Movie Review | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్.. ఇలా ముగ్గురు హీరోల కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. పైగా ఈ ముగ్గురూ సినిమాలకి కొంత విరామం ఇచ్చారు. అలాంటి ముగ్గురు హీరోలు కలిసికట్టుగా ‘భైరవం’తో ప్రేక్షకులు ముందుకు రావడం, ప్రమోషనల్ కంటెంట్ సినిమా బజ్ ఇవ్వడంతో సినిమాపై హైప్ ఏర్పడింది. పైగా ఇది తమిళ ‘గరుడన్’ రిమేక్. తమిళ్ లో ఈ కథ మంచి విజయాన్నే అందుకుంది. మరి తెలుగు ప్రేక్షకులుని ఎంతలా మెప్పించింది? గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడిందా ? రివ్యూలో చూద్దాం.
కథ: గజపతివర్మ (మంచు మనోజ్), వరద (నారా రోహిత్) ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరి నమ్మిన బంటు శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). ఆ ఊర్లో వారాహీ అమ్మవారి గుడికి చెందిన భూముల మీద దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) కన్ను పడుతుంది. ఈ కుట్ర ప్రాణ స్నేహితులైన గజపతి, వరద, శ్రీను మధ్య ఎలాంటి విభేదాలని తీసుకొస్తుంది? ఎలాంటి పంతానికి కారణం అవుతుంది? గజపతి భార్య నీలిమ (ఆనంది), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), శ్రీను ప్రేమించిన అమ్మాయి వెన్నెల (అదితి శంకర్) ఈ కథలో ఎలాంటి పాత్రలు పోషించారు? అనేది మిగిలిన స్టోరీ.
కథా విశ్లేషణ: ఒరిజినల్ గా వెట్రిమారన్ తయారుచేస్తున్న కథ ఇది. ఆయన కథల్లో డెప్త్ వుంటుంది. కథ పరంగా చూసుకుంటే గరుడన్ బలమైనదే. గరుడన్ సినిమా చూసిన జనాలు కూడా కథ బావుంది కానీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేదనే విమర్శ చేశారు. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ కథని తెలుగులో ఆడియన్స్ అభిరుచికి తగ్గుట్టుగా మలచడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఓ మాస్ కమర్షియల్ సినిమాని తీర్చిదిద్దడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యాడు.
చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో కథ మొదలౌతుంది. అయితే అది కాస్త నీరసంగానే సాగుతుంది. ముగ్గురు హీరోల పాత్రలు ఎస్టాబ్లెస్ చేసిన తర్వాత కథలో జోష్ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఓ ముఫ్ఫై నిముషాలు ఆడియన్స్ కథలో ఎంగేజ్ చేసే విధంగా యాక్షన్ ని డిజైన్ చేశాడు దర్శకుడు. మిత్రులు శత్రువులుగా మారడం, ఇంట్రవెల్ బ్యాంగ్ తీర్చిదిద్దిన తీరు, గుడి నేపథ్యంలో సాగిన యాక్షన్ సీక్వెన్స్, శ్రీను క్యారెక్టర్ పూనకం… ఇవన్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ఫస్ట్ మంచి కథనానికి బీజం వేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ డ్రామాని పండించడంలో తడబడింది. కథలోని ఆత్మని పట్టుకోకుండా యాక్షన్ మోడ్‌లోకి నడిపేశారు. కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తాయి. గరుడన్ సమస్య కొత్తదనం లేని స్క్రీన్ ప్లే. తెలుగులోనూ అదే మైనస్ గా కనిపించింది. ఒక దశలో కథ ఊహకు అందిపోతుంది. అయితే మాస్ కమర్షియల్ సినిమాలని ఇష్టపడే ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ అయితే ఇందులో వుంది.
నటీనటులు నటన: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్.. ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. తెరపై వారి కెమిస్ట్రీ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఒకరెక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ముగ్గురూ పాత్రల్లో ఒదిగిపోయారు. బెల్లంకొండ యాక్షన్ లో ఆకట్టుకున్నాడు. పూనకాలు ఎలివేషన్లు మాస్ ని మెప్పించేలా వున్నాయి. మనోజ్ పవర్ ఫుల్ గా కనిపించాడు. తన ప్రజెన్స్, డైలాగ్ చెప్పే తీరు కమర్షియల్ సినిమాకి పర్ఫెక్ట్. నారా రోహిత్ తన పరిణతి చూపించాడు. తన పాత్రలో ఒదిగిపోయాడు. లవ్ స్టొరీలు ఈ కథలో సింక్ అవ్వలేదు. అతిథి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై పాత్రలు చెప్పుకునేలా లేవు. వెన్నెల కిషోర్ నవ్వించలేపోయాడు. జయసుధ ఎప్పటిలానే హుందాగా కనిపించారు. మిగతా నటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్ గా: టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. శ్రీచరణ్ బీజీఎం బావుంది. యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. పాటలు రిజిస్టర్ కాలేదు. హరి కెమరా వర్క్ సినిమాకి మంచి ఫీల్ ని తీసుకొచ్చింది. గుడి సెట్ రియల్ గా వుంది. ఎడిటర్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. సినిమా బిగినింగ్, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంకాస్త షార్ఫ్ గా చెప్పాల్సింది. కొన్ని డైలాగులు పేలాయి. దర్శకుడు విజయ్ మాస్ కి నచ్చే ఎంటర్టైనర్ ని ఇవ్వగలిగాడు.
ప్లస్ పాయింట్స్
కథ నేపధ్యం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటన
మాస్ యాక్షన్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథనం
ఫోర్స్ గా అనిపించే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్
రేటింగ్: 3/5
Read More