ముంబై: ఆదిపురుష్ సినిమాలోని డైలాగులు, పాత్రలు ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దాదాపు అన్ని వర్గాల వాళ్లు ఆ సినిమాలోని డైలాగులపై, ఆ సినిమాలో పాత్రలను మలిచిన తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో తర్వాత ఆ డైలాగులను మార్చేశారు.
అయితే ఆ సినిమాలో నటించిన నటుడే తాజాగా ఆదిపురుష్ డైలాగులపై విచారం వ్యక్తం చేశాడు. ఆ సినిమాలోని డైలాగులతో ఒక హిందువుగా తాను కూడా చాలా బాధపడ్డానని అన్నాడు. ఇంతకూ అతనెవరు అనుకుంటున్నారా..? అతనే లవీ పజ్ని. ఆదిపురుష్ సినిమాలో ఆయన కుంభకర్ణుడి పాత్ర పోషించాడు. సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందేనని, అందుకే తాను ఏమీ అనలేకపోయానని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొన్ని డైలాగులను మార్చినప్పటికీ ఒక హిందువుగా తాను చాలా బాధపడ్డానని అన్నారు.