‘ ఈ కథకు ‘బ్యూటీ’ అనేది సరైన టైటిల్. ఎందుకంటే ఈ కథలోనే బ్యూటీ ఉంది. జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. ఎంటైర్టెన్మెంట్, ఎమోషన్స్ కలగలుపు ఈ సినిమా. సినిమాటిక్ లిబర్టీ అనేది ఏ మాత్రం లేకుండా పూర్తి ఆర్గానిక్‌గా తీసిన సినిమా ఇది.’ అని వీకే నరేష్ అన్నారు. అంకిత్ కొయ్య, నీలఖి లీడ్‌రోల్స్ చేసిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘బ్యూ టీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకుడు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న వీకే నరేష్, నటి వాసుకి మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. నటి వాసుకి మాట్లాడుతూ ‘ఆడపిల్ల తల్లిని కావడంవల్ల ఈ కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒక తల్లికీ, ఒక కూతురుకీ ఉండాల్సిన అవగాహన, బాధ్యత ఈ కథలో ఉన్నాయి. పిల్లల విషయంలో మనం కఠినంగా ఉంటే సరిపోదు, వారి పాయింట్లో ఏముందో చూడాలి అని చెప్పే సినిమా ఇది. ఈ తరం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’ అని పేర్కొన్నారు.