VK Naresh | అంకిత్ కొయ్య, నీలఖి కాంబోలో వచ్చిన చిత్రం బ్యూటీ (Beauty). జేఎస్ఎస్ వర్ధన్ మాటలందిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బ్యూటీ టీం సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
ఈవెంట్లో యాక్టర్ వీకే నరేశ్ మాట్లాడుతూ.. బ్యూటీ సినిమాలోని సోల్ ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్లో 350 సినిమాలు చేసి ఉంటా. ఈ సినిమాకు రివ్యూలన్నింటిని ప్రింట్ తీసుకుంటున్నా. నా జీవితంలో ఇలాంటి రివ్యూలు రాలేదు. మా బ్యూటీ సినిమాను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ సినిమా మాత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రతీ ఒక్కరికీ, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అన్ని వర్గాల మనసులకు హత్తుకునే సినిమాను తీసిన వర్దన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. బ్యూటీ సినిమా అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తర్వాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా సక్సెస్. మనం చేసే పని మాత్రమే కాదు.. మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ సినిమా కూడా ఏ ఒక్కరినీ నిరాశపరచలేదు. అంకిత కొయ్య అంటే మినిమం గ్యారంటీ. సినిమాను నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుంది. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు.
బ్యూటీ ప్రతీ చోటా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. నేను వ్యక్తిగతం 15 థియేటర్లను సందర్శించాను. ప్రతీ చోట వస్తున్న స్పందన అద్భుతం. బ్యూటీకి సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు డైరెక్టర్ వర్దన్.
Whistles. Claps. Packed theatres.
Thanks for showering #Beauty with so much love 🥰💖 pic.twitter.com/VPDnSNc4Ch— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) September 21, 2025
Kantara Chapter 1 | రిషబ్ శెట్టి టీంకు ప్రభాస్ సపోర్ట్.. కాంతార చాప్టర్-1పై సూపర్ హైప్
SYG | సాయి దుర్గ తేజ్ సంబరాల యేటి గట్టు విడుదల వాయిదా.. మేకర్స్ క్లారిటీ
They Call Him OG | ఓజీ కోసం రూల్ బ్రేక్ చేసిన పవన్ కల్యాణ్.. థమన్ కామెంట్స్ వైరల్