Rashi Khanna | పోయినచోట వెతుక్కోవడం అనే సామెత నాయికలకు దాదాపుగా వర్తించదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు తారలు. ఒక భాషలో కోల్పోయిన క్రేజ్‌ను మరో చోట వెతుక్కునే ప్రయత్నం చేయడం వీరి ప్రత్యేకత. తెలుగులో వెనకబడగానే తమిళం వైపు అక్కడి నుంచి బాలీవుడ్ వైపు దృష్టి సారించింది అందాల నాయిక రాశీ ఖన్నా. అయితే గతేడాది ఆమెకు తెలుగు, తమిళంలో కలిసి రెండు భాషల్లో నాలుగు అపజయాలు ఎదురయ్యాయి. దీంతో హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన తను చేస్తున్న ‘యోధ’ చిత్రంపై ఆశలు పెట్టుకుందీ భామ.
ఈలోగా వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ మంచి విజయం సాధించి ఆమెకు డిజిటల్ వేదికల మీద మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో మేఘా వ్యాస్ అనే ఆర్బీఐ అధికారిణి పాత్రలో రాశీ నటన మెప్పించింది. ఈ ఎత్తుపల్లాల కెరీర్‌పై రాశీ ఖన్నా స్పందిస్తూ…‘తొలి సినిమా ‘మద్రాస్ కేఫ్’లో నటిస్తున్నప్పుడు నటన అంటే ఓనమాలు కూడా తెలియదు. అంతలోనే దక్షిణాదిలో వరుస అవకాశాలు వచ్చాయి. కొత్త విషయాలు నేర్చుకుంటూ నట ప్రయాణం సాగిస్తూ వచ్చా. నేను తెచ్చుకున్న పేరు వెనక ఎంతో శ్రమ ఉంది. మొదట్లో అపజయాలు చాలా బాధించేవి. కానీ ఇప్పుడు జయాపజయాలకు అతీతంగా నిబ్బరంగా ఉండటం అలవాటైంది. ఏమైనా ఇక్కడ ఉండాలంటే సక్సెస్ అనేది ముఖ్యం. పబ్లిక్ ఫిగర్‌గా నేనెప్పుడూ విమర్శలు, ట్రోలింగ్స్‌కు సిద్ధపడే ఉంటాను’ అని చెప్పింది.
రాశి ఖన్నా ఫొటోల కోసం: Rashi Khanna | మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా..