చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకుడు. మేఘనా ముఖర్జీ కథానాయిక. శనివారం ఈ సినిమా నుంచి ‘రెడ్డి మామ’ అంటూ సాగే ఓ మాస్ గీతాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఆర్ఆర్ ధృవన్ స్వరపరచిన ఈ గీతాన్ని సురేష్ గంగుల రచించారు. నకాష్ అజీజ్, సాహితి చాగంటి ఆలపించారు.
మాస్ బీట్తో హుషారెత్తించేలా ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, న్యూఏజ్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను రూపొందించామని మేకర్స్ తెలిపారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాతలు: గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్, దర్శకత్వం: సంపత్రుద్ర.