Bangkok Pilla | కొద్ది రోజుల క్రితం బ్యాంకాక్‌తో పాటు మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా తదితర ప్రాంతాలలో భూకంపం ఎంత విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూకంపం ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు రోడ్డున పడ్డారు. భారీ ఆస్తి కూడా సంభవించింది. ఇప్పటికీ ఈ దేశాలు భూకంప తీవ్రత నుంచి కోలేకోలేకపోతున్నాయ. భారత్ తో సహా పలు దేశాలు భూకంప బాధితులకు ఆహారం తదితర నిత్యావసర సరుకులు అందజేసి మంచి మనసు చాటుకుంటున్నాయి. మరోవైపు భూకంపాల కారణంగా మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భూకంప బాధితుల్లో మన బ్యాంకాక్ పిల్ల అలియాస్ శ్రావణి వర్మ సామంత పూడి ఒకరు. ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ధీన స్థితిని తెలియజేయగా, ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనం చూశాం. ఇక భూకంపం తర్వాత తమ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియజేసింది. భారీ భూకంపం కారణంగా బ్యాంకాక్ పిల్ల ఉంటున్న అపార్ట్మెంట్ పూర్తిగా డ్యామేజ్ అయింది. బీటలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో అది ఎప్పుడైన కూలిపోయే అవకాశం ఉందని, అక్కడ నివాసం ఉండే అందరిని ప్రభుత్వం ఖాళీ చేయించింది. దీంతో కొత్త విల్లాకి షిఫ్ట్ అయ్యాం అంటూ బ్యాంకాక్ పిల్ల వీడియో అప్లోడ్ చేసింది.
‘ తట్టా బుట్టా తో రోడ్డున పడ్డాం’ అంటూ ఆమె అప్లోడ్ చేసిన వీడియోలో పెద్ద విల్లాను చూపిస్తూ తాము అందులోకి షిఫ్ట్ అయిపోయామని చెప్పుకొచ్చింది. తన సబ్స్క్రైబర్లందరికీ ఆ విల్లాను మొత్తం తిప్పి చూపిస్తూ అందులో సోఫా, టీవీ, వాషింగ్ మెషీన్‌తో పాటు అన్ని సౌకర్యాలు ముందు నుండే ఉన్నాయని తెలియజేసింది. కేవలం బట్టలు సర్దుకొని వచ్చేశామని బ్యాంకాక్ పిల్ల చెప్పింది. కాగా ఏపీ ప్రాంతానికి చెందిన శ్రావణి తన భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ కు వెళ్లి అక్కడే స్థిర పడిపోయింది. తను ఖాళీగా ఉండలేక యూట్యూబ్ ద్వారా అక్కడి పరిస్థితులు తెలియజేస్తూ ఫుల్ పాపులర్ అయింది. త్వరలో బిగ్ బాస్ షోకి ఈ అమ్మడు రానుందని ప్రచారం జరుగుతుంది.