నటుడిగా,నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చూపించిన బండ్ల గణేష్ కొద్ది రోజులు రాజకీయాలు చేసి చివరికి మళ్లీ సినిమాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల ఇందులో చిన్న పాత్ర పోషించి మెప్పించాడు. ఇక త్వరలో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాని నిర్మించనున్నాడు.
కరోనా సమయం నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్న బండ్ల గణేష్ తనకు చేతనంత సాయం చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. గూగుల్ పే ద్వారా సాయం కొందరికి బండ్ల మనీ పంపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్లో ఓ టీనేజ్ కుర్రాడు కళ్లకి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని క్యూట్‌గా కనిపిస్తున్నాడు. ఇతనని చూసి కొందరు బండ్ల గణేష్ డూప్ అనుకున్నారు.
నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల అంటూ కుమారుడిని పరిచయం చేశాడు బండ్ల. దీంతో నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘జూనియర్ బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్.. తండ్రికి తగ్గ తనయుడు’.. ‘భలే ఉన్నాడు సార్.. ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా.. బండ్ల 2లా’.. ఉన్నాడని అంటున్నారు. సినిమాలలోకి తీసుకు వస్తారా అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే అంతా దేవుడి దయ అని చెప్పుకొచ్చాడు గణేష్.