Bandla Ganesh | కరోనా మరోమారు టాలీవుడ్లో కలకలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మరో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన స్వయంగా ఈ సంగతి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఆదివారం స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకుంటే కొవిడ్ పాజిటివ్ అని తేలిందని తెలిపారు.
తన కుటుంబ సభ్యులకు నెగెటివ్ అని వచ్చిందని బండ్ల గణేశ్ తెలిపారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. ప్రయాణాలు చేయడానికి ముందు ఒకసారి ఆలోచించుకోవాలని.. అందరూ సురక్షితంగా ఉండాలని సూచిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు బండ్ల గణేశ్‌కు రెండుసార్లు కోవిడ్ సోకింది. సెకండ్ వేవ్‌లో ఐసీయూలో చికిత్స పొందారు.