Bandla Ganesh | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి మార్తండ్ దర్శకత్వం వహించగా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్‌హిట్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను గురువారం ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ రాగా.. బండ్ల గణేష్, అల్లు అరవింద్ పత్యేక అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లిటిల్ హార్ట్స్ సినిమాను ప్రమోట్ చేసి ఇంత పెద్ద హిట్ చేసింది బన్నీ వాసు, వంశీ నందిపాటి అయిన క్రెడిట్ మొత్తం అరవింద్‌కే పోతుంది. వాళ్లు ఎంత కష్టపడిని చివరికి ఇది అరవింద్ సినిమా అంటున్నారు. దాంతో క్రెడిట్ అల్లు అరవింద్‌కే వస్తుంది అంటూ ఆటపట్టించాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అల్లు అరవింద్ ఏం చెయ్యడు.. లాస్ట్‌లో వస్తాడు క్రెడిట్స్ వేసుకుంటాడు
లిటిల్ హార్ట్స్ సినిమా తీసినందుకు బన్నీ వాసుకు, వంశీ నందిపాటికి అభినందనలు – లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఫంక్షన్లో బండ్ల గణేష్ pic.twitter.com/4bLezX77sh
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025