బండ్ల గణేష్.. నటుడు, నిర్మాతగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బండ్ల ఎప్పుడు పవన్ జపం చేస్తుంటారు. త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా కూడా చేయనున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అభిమానుల ఆగ్రహానికి గురవుతారంటూ ఇటీవల ఆయనపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా బండ్ల గణేష్ సాయం అడిగిన వ్యక్తికి ఆర్ధికంగా చేయూతనందించేందుకు సిద్ధమయ్యారు. ఆటో ప్రమాదం జరిగి ఆపరేషన్ చేయడం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు.. కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బండ్ల గణేష్‌ను సహాయం కోసం అర్థించారు. ఆ వెంటనే బండ్ల గణేష్ స్పందించి.. గూగుల్ పే నంబర్ పంపించమని సదరు వ్యక్తిని అడిగారు. అలా బండ్ల గణేష్ వెంటనే స్పందించడం, సాయం చేసేందుకు ముందుకురావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయం కోరిన వ్యక్తి ఇంటి పేరు కూడా బండ్ల ఉండడం విశేషం.
@ganeshbandla నమస్కారం అన్న ఇతను మా అన్నయ్య బండ్ల లింగయ్య ఆటో ప్రమాదం జరిగింది ఆపరేషన్ చేశారు 48 కుట్లు వేశారు డాక్టర్స్ 6month ఇంట్లో ఉండమన్నారు ఆర్ధికంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎవ్వరు కూడా స్పందించట్లేదు మీరైన కొంచెం ఆదుకోండి గణేష్ అన్న🙏 ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ph 9951550685 pic.twitter.com/b4G1EjxWKk
— Ramakrishna Bandla (@alwaysRamakrish) July 14, 2021