Bandla Ganesh | మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుక ఇటీవల సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్‌కు ఉన్న అభిమానం ఎలాంటిందో అభిమానులకి బాగా తెలుసు. దీంతో ఈ ఇద్దరి కలయికకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఆ క్షణాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్టులు కూడా అభిమానులను కదిలించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాకుండా బండ్ల గణేష్ నిర్మాతగా కెరీర్లో కూడా అత్యంత కీలకమైన చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడం తన జీవితంలోని ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను తనకు కేవలం హీరోగా కాకుండా, ఒక ఆరాధ్య వ్యక్తిగా చూస్తానని మరోసారి వెల్లడించారు.
అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన చేసిన మరో ప్రకటన ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో పవన్ కళ్యాణ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తానని, ఆ సినిమా పూర్తయిన తర్వాత తన నిర్మాణ సంస్థను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నిర్ణయానికి కారణాన్ని వివరిస్తూ, “పవన్ కళ్యాణ్ సినిమాతోనే నిర్మాతగా నాకు అత్యున్నత గుర్తింపు వచ్చింది. మళ్లీ అదే వ్యక్తితో సినిమా చేసి నా సినీ ప్రయాణానికి ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నాను” అని బండ్ల గణేష్ భావోద్వేగంగా తెలిపారు.
ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ కాంబినేషన్లో మరో సినిమా నిజంగానే వస్తుందా? వస్తే దానికి దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతోంది? అనే చర్చలు అభిమానుల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు