Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం.. హాజరైన చిరంజీవి దంపతులు
Bandla Ganesh | ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబంలో హంగామా నెలకొంది. ఆయన కూతురు జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం అట్టహాసంగా జరిగింది. ఈరోజు హైదరాబాద్లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వచనాలు అందించారు.
Bandla Ganesh | ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబంలో హంగామా నెలకొంది. ఆయన కూతురు జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం అట్టహాసంగా జరిగింది. ఈరోజు హైదరాబాద్లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వచనాలు అందించారు. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరగనుంది. ఇక ఈ రోజు జరిగిన నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, శివాజీ, కోన వెంకట్, సి. కల్యాణ్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు హాజరయ్యారు.
బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం త్వరలోనే జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ ఆనందకరమైన విషయాన్ని గణేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇక కొద్ది రోజుల క్రితం..
“శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం” అంటూ ప్రారంభించిన ఆయన, కాబోయే వరుడు సూర్యతేజ చిలుకూరి, తన కుమార్తె జనని వివాహానికి సంబంధించి ‘పసుపు కుంకుమ కార్యక్రమం’ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేయగా, అందులో ఇరు కుటుంబాల సభ్యులు, కాబోయే అల్లుడు కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ శుభవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలులిపారు. ఆయన కూతురు వివాహం సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో బండ్ల గణేశ్ పలు సినిమాల్లో కమెడియన్గా, సహాయక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్యవంశం, సుస్వాగతం, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, పోకిరి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం నిర్మాతగా మారి ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ స్థాపించి ఆంజనేయులు, గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా, గోవిందుడు అందరివాడేలే వంటి హిట్ సినిమాలను నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

