Trivikram Srinivas – Bandla Ganesh | టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకకు దర్శకుడు హరీశ్ శంకర్‌తో పాటు నిర్మాత బండ్ల గణేష్ హాజరై మీడియాతో ముచ్చటించారు. అయితే మీడియాతో మాట్లాడుతూనే బండ్ల గణేష్ త్రివిక్రమ్‌కు ధన్యవాదాలతో పాటు క్షమాపణలు చెప్పారు.
గబ్బర్ సింగ్ మూవీ తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అన్నారు. పవన్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చేశారని బండ్ల గణేష్ తెలిపారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఓ అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారాను. అయితే తరువాత ఘటనకు సంబంధించి చాలా బాధపడ్డాను. ఈ ఘటనపై త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నాను అంటూ బండ్ల చెప్పుకోచ్చాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఓ అభిమాని బండ్ల గణేష్‌కు ఫోన్ చేసి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడం లేదా అని అడుగుతాడు. అయితే దీనికి బండ్ల సమాధానమిస్తూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఈవెంట్‌కు రానివ్వడం లేదని చెప్పాడు అయితే ఇందుకు సంబంధించిన ఆడియో అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. అయితే ఫస్ట్ తాను ఈ వ్యాఖ్యలు అనలేదని అన్నా.. ఆ తరువాత ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు బండ్లగణేష్.
BandlaGanesh thanking #TrivikramSrinivas #GabbarSingh4k pic.twitter.com/MPcbrIhw7N
— Mr.PowerStar (@manikaly7an) August 31, 2024
ALso read..