యంగ్ హీరో రోషన్ కనకాల నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మల్టీ టాలెంటెడ్ బండి సరోజ్‌కుమార్ ‘నోయల్’ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. క్యాండిల్‌తో సిగరెట్ వెలిగిస్తూ సీరియస్‌గా చూస్తున్న సరోజ్కుమార్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. రోషన్ కనకాల మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ సినిమాలో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: రామమారుతి.ఎం, సంగీతం: కాలభైరవ, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.