Bandi Sanjay – Kangana Raunat | ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. ఇక ఈ సమావేశంలో ఎన్డీయే పక్ష నేత (parliamentary party leader)గా నరేంద్ర మోదీ (Narendra Modi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting)లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ అవుతున్నాడు.
ఈ సమావేశానికి ముందు మండీ ఎంపీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్లు ఒకరికి ఒకరు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుపుదామని కంగనాకు ఫ్లవర్స్ బొకే(Flowers Bouquet) ఇస్తాడు. అయితే బండి ఎవరో తెలియని కంగనా తనవైపు చూసి పట్టించుకోకుండా వెళుతుంది. దీంతో బండిని బీజేపీ అధిష్టానమే కాకుండా కంగనా కూడా పట్టించుకోలే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ వార్త పోస్ట్ చేసిన ANI కూడా బండి సంజయ్‌ను గుర్తుపట్టలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This is the respect a South Indian BJP MP gets from North Indian BJP MP.
She doesn’t even collect the flower bouquet, I highly doubt if she even knows Bandi Sanjay.
Is this not insult a BC MP? pic.twitter.com/bi2lgwSLva
— Nikhil Reddy Gudur (@NikhilReddyINC) June 7, 2024
Em chesthunnav Anna @bandisanjay_bjp pic.twitter.com/hziXEGlbJE
— VB (@Mr_ViolentBoy) June 7, 2024
Bandi Sanjay doesn’t get any attention, even Kangana barely acknowledges him 😂😂 she doesn’t even take the flowers. No mention in ANI tweet. 😂
Telangana Sanghis who voted for BJP must be proud of their simping 😂😂 https://t.co/3sRvR1gbN7
— Muhammed Hussain (@iamzappy) June 7, 2024