హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ల, సాయికుమార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న వినోదాత్మక ప్రేమకథ ‘బ్యాండ్ మేళం’. ‘Every Beat Has an Emotion’ అనేది ఉపశీర్షిక. సతీష్ జవ్వాజి దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.
శనివారం ఇందులోని కథానాయిక శ్రీదేవి అపళ్ల పుట్టిన రోజు సందర్భంగా ఓ బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందుతున్న అందమైన ప్రేమకథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: విజయ్ బుల్గానిన్, పాటలు: చంద్రబోస్, సమర్పణ: బ్యాంగో మాస్ మీడియా.