జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో జంటగా రూపొందుతున్న సినిమా ‘బనారస్’. జయతీర్థ దర్శకుడు. తిలక్‌రాజ్ బల్లాల్ నిర్మాత. ఈ సినిమా త్వరలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని మాయ గంగ పాటను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘మాయా గంగ పాట చాలా బాగుంది. ఈ సినిమా ఎంత క్వాలిటీగా ఉందో అని చెప్పేందుకు ఈ పాటే నిదర్శనం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘నాటకరంగం నుంచి సినీ రంగానికి వచ్చాను. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమాతో గుర్తింపు దక్కింది. ఈ చిత్రంతో తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ పేరొస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే కన్నడ, మలయాళంలో విడుదలైన ఈ పాట హిట్ అయ్యింది’ అని దర్శకుడు జయతీర్థ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.