Bambai Meri Jaan | డిస్నీ + హాట్‌స్టార్ (Disney + Hotstar)లో వచ్చిన స్పెషల్ ఓపీఎస్ (Special OPS) వెబ్ సిరీస్ గుర్తుందా. రెండు పార్టులుగా వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇక ఈ వెబ్‌సీరిస్‌లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. తర్వాత వచ్చిన షాహిద్ కపూర్ ఫర్జీ (Farzi) వెబ్‌సీరిస్‌లో కూడా కేకే మీనన్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. కాగా కేకే మీనన్ (Kay Kay) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సీరిస్ బాంబై మేరీ జాన్. (Bambai Meri Jaan) షుజాత్ సౌదాగర్ (Shujath Saudhagar) దర్శకత్వం వహిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 14 నుంచి బాంబై మేరీ జాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ను ఎక్సెల్ మీడియా & ఎంటర్టైన్మెంట్ (Excel Media Entertainament) నిర్మిస్తుండగా.. అవినాష్ తివారీ (Avinash Tiwari), కృతికా కమ్రా, నివేదిత భట్టాచార్య, అమైరా దస్తూర్ (AmyraDastur) ప్రధాన పాత్రలు పోషిసస్తున్నారు. 10 ఎపిసోడ్లుగా రానున్నా ఈ సిరీస్ స్వాతంత్య్రానంతరం జరిగిన కథగా తెలుస్తుంది.
Kk Menon and avinash tiwari
from nothing, to something, & then everything#BambaiMeriJaanOnPrime, new series, Sept 14@kaykaymenon02 @avinashtiw85 @Kritika_Kamra @nivedita_be @AmyraDastur93 #SaurabhSachdeva @jitin0804 #NawabShah @VivanBhathena @ShivPanditt @lakshyakochhar @iamSKPalwal @ShujaatSaudagar… pic.twitter.com/YVnFkVQkvF
— prime video IN (@PrimeVideoIN) August 28, 2023