Balakrishna | ఓ వైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూ మరోవైపు సినిమా షూటింగ్‌లను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారం నుండి ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ కానున్నారు. బాబీడియోల్, బాలయ్యలపై భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని దర్శకుడు బాబీ తెరకెక్కించనున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ కూడా నిర్మిస్తున్నారట నిర్మాతలు నాగవంశీ, సాయిసౌజన్య. ఈ సీక్వెన్స్ బాబీడియోల్ పాత్రతోనే మొదలవుతుందట. ఇందులో ఆయన విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకే హైలైట్‌గా ఈ ఎపిసోడ్ ఉండనుందని దర్శకుడు బాబీ చెబుతున్నారు. ముఖ్యంగా బాలయ్య ఆహార్యం, ఆయన యాటిడ్యూడ్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటాయని ఆయన అన్నారు. ఊర్వశీ రౌటేలా, చాందిని చౌదరి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.