Bala Krishna | నందమూరి బాలయ్య ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. కొద్ది రోజులుగా అఖండ 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ప్రతి రోజు పార్లమెంటుకు సైకిల్‌పై వస్తానని చెప్పి ఆ సైకిల్ని బాలకృష్ణకు చూపించారు. బాలయ్య ఆ సైకిల్‌పై ఎక్కి కాసేపు సందడి చేశారు. అనంతరం ఆయన పార్టీ ఎంపీలతో కలిసి స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు.అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతులు అందజేసినట్టు తెలుపస్తుంది.. అయితే సైకిల్ ఎక్కి సందడి చేసిన బాలయ్య వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అఖండ 2 అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీ హిట్ అయితే ఆయన ఖాతాలో డబుల్ హ్యాట్సిక్ చేరుతుంది. “అఖండ 2 తాండవం” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో అఖండ 2 కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉండగా ఈ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలయికలో మూడోసారి వర్క్ చేయనున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.
గతంలో క్రిష్ తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. వీటి తర్వాత హ్యాట్రిక్ సినిమా కోసం రెడి అవుతున్నారట. మరి ఈ సినిమా కోసం బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఇప్పటికే క్రిష్.. బాలయ్యని కలిసి కథ వినిపించగా, అది ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అంటున్నారు. బాలయ్య ఇపుడు వరకు ఎన్నో సినిమాలలో డ్యూయల్ రోల్ చేయగా, ఇప్పుడు క్రిష్ సినిమా కోసం మళ్లీ రెండు పాత్రల్లో అలరించనున్నారని తెలిసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Actor Balakrishna appeared with cycle in the premises of Parliament,Delhi.#TDP #Balakrishna pic.twitter.com/Hwbf3thZq3
— AM Polls (@am_polls) July 31, 2025