ఆర్ఆర్ఆర్, సైరా, ఖైదీ నంబర్ 150, మహానటి చిత్రాలతోపాటు ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ అందించారు పాపులర్ రైటర్ సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra). ఈ టాలెంటెడ్ రైటర్ తాజాగా బాలకృష్ణ (balakrishna) నటిస్తోన్న వీరసింహారెడ్డిలో అదిరిపోయే డైలాగ్స్ అందిస్తున్నారు. ఆయన డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో ఒక్క గ్లింప్స్ వీడియోతోనే అర్థం చేసుకోవచ్చు.
ఇవాళ ఒంగోలులో వీరసింహారెడ్డి (Veera Simha Reddy) ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయిమాధవ్ బుర్రా స్పీచ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేలా సాగింది. నటసింహం, వీర సింహమై గర్జిస్తే ఆ గర్జన ఎలా ఉంటుందో వీరసింహారెడ్డి అలా ఉంటుందని తనదైన స్టైల్లో సినిమా గురించి ప్రసంగం మొదలుపెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ బాలయ్య బాబు ఫ్యాన్.. అనంతపురం జగన్ నుంచి ఆస్ట్రేలియా బాలరాజు దాకా..తొడగొట్టి తల ఎత్తి జై బాలయ్య అని నినదించే స్థాయిలో ఉంటుంది వీరసింహారెడ్డి. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.
‘కత్తులుంటాయి.. కన్నీళ్లుంటాయి. కవ్వింతలుంటాయి. కేరింతలుంటాయి. నెత్తురుంటుంది. నీతి చెబుతుంది. బాలయ్యబాబు ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు. ఒక మంచి డైలాగ్ రాసినపుడు ఒక కిక్ ఉంటుంది. ఆ డైలాగ్ బాలయ్య బాబు చెప్తే ఆ కిక్కెలా ఉంటుంది. కుర్రాళ్లకు ఓ అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ చెప్తున్నట్టుంటుంది. నాలాంటి వాడికి పెద్ద కూతురు పెళ్లి కుదిరినట్టుంటుంది. అమ్మాయిలకు నచ్చినవాడు తాళి కడుతున్నట్టుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మ ముద్దు పెడుతున్నట్టుంటుంది. ఇలాంటి సినిమాలో నేనూ ఒక భాగమని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నా. గౌరవంగా ఫీలవుతున్నానన్నారు’.
Natasimham #NandamuriBalakrishna's aura and royalty is matchless ❤️🔥
Watch #VeeraSimhaReddy Grand Pre Release Event live now 💥
– https://t.co/iGw7BqdKCQ@shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth @shreyasgroup pic.twitter.com/MhI4iaMfy8
— Mythri Movie Makers (@MythriOfficial) January 6, 2023