Balakrishna-gopichandmalineni movie | అఖండ సినిమాతో ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి బాలకృష్ణ. వరుసగా ఫ్లాప్స్ వెంటాడుతున్న సమయంలో అఖండ సినిమా బాలయ్యకు మంచి కమర్షియల్ సక్సెస్‌ను తీసుకొచ్చింది. ఇక ఇదే స్పీడ్‌ను తరువాత వచ్చే సినిమాలలో కూడా కంటిన్యూ చెయ్యాలని భావిస్తున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యుల్‌ను సిరిసిల్లలో ప్రారంభించారు. ఆ షూటింగ్ నుండి ఒక పిక్ కూడా లీక్ అయింది. రగ్గుడ్ గడ్డంతో ఊర మాస్ లుక్‌లో ఉన్న బాలయ్య ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్లో నటించనున్నాడని సమాచారం. అందులో ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్‌గా నటిస్తే మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడని టాక్. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వరుసగా బాలయ్య అఖండతో హిట్ అందుకోగా, గోపించంద్ క్రాక్‌తో హిట్ అందుకున్నాడు. వీళ్లీద్దరి కలిసి రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.