టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కాలం తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న విడుదల కానుంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇపుడొక ఆసక్తికర అప్డేట్ అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది.
అదేంటంటే వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు ఓ ప్రముఖ వ్యక్తి ముఖ్యఅతిథిగా రాబోతున్నాడట. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారా..? ఇంకెవరో కాదు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవెంట్‌కు బాలకృష్ణను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ అప్డేట్ అఫీషియల్‌గా రావాల్సి ఉన్నా.. తాజా న్యూస్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్న మూవీ వీరసింహారెడ్డి (Veera Simha Reddy) జనవరి 12న విడుదల కానుంది. రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో రిలీజ్ అవుతుండటం, రెండూ ఒకే బ్యానర్లో వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫైట్ ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరసింహారెడ్డిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.