Balakrishna Movie | నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్‌తో జోరుమీదున్నాడు. గత రెండేళ్లలో బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ మాత్రమే. రూలర్ సినిమా తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌కు ఆలస్యమవుతూ వచ్చిన అఖండ గతేడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా గతనెలలో డిజిటల్లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి ప్రదర్శితమవుతుంది. ఇక అఖండకు వచ్చిన గ్యాప్‌ను పూర్తి చేయడానికి బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు.
ఇప్పటికే ఈయన గోపిచంద్ మలినేనీ , అనీల్ రావిపూడిలతో సినిమాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చాయి. గత రెండు మూడు రోజుల నుండి నారప్ప ఫేం శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా చేబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా గీతాగోవిందం ఫేం పరుషురాంను కూడా బాలకృష్ణ లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. పరుషురాం బాలకృష్ణకు ఒక లైన్ వినిపించాడట. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇందులో వాస్తవమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పరుషురాం ప్రస్తుతం మహేష్‌బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నాడు.