ఏడాదికి రెండు సినిమాలు చేయాలని బాలకృష్ణ గట్టిగా ఫిక్సయ్యారు. అందులో భాగంగానే గత ఏడాది డాకూమహరాజ్, అఖండ 2 చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారాయన. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదల కానుంది. ఆ వెంటనే, డిసెంబర్లోకానీ, సంక్రాంతికి కానీ మరో సినిమాను విడుదల చేయాలనే తలంపుతో ఉన్నారు బాలకృష్ణ.
అందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ కథకు ఓకే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. అయ్యప్పన్ కొషియం, తుడరుమ్, కొత్తలోక, సరిపోదా శనివారం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.