Nandamuri Balakrishna Fancy Car | టాలీవుడ్ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ త్వరలో రిజిస్టర్ చేయనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.
ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ జోన్లో ఒక్క రోజులోనే రవాణాశాఖకు రూ.37,15,645 ఆదాయం సమకూరింది. ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీజీ09ఎఫ్0099 నంబర్‌ను కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4,75,999కి దక్కించుకుంది. టీజీ09ఎఫ్0009 నంబర్‌ను కమలాలయ హైసాఫ్ట్ సంస్థ, ఎఫ్0005 నంబర్‌ను జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.1,49,999కి, ఎఫ్0007 నంబర్‌ను శ్రీనివాసనాయుడు రూ.1,37,779కి, ఎఫ్0019 నంబర్‌ను నేత్రావతి బలగప్ప శివలిప్ప రూ.60 వేలకు సొంతం చేసుకున్నారు. అలాగే, గత సిరీస్‌లోని టీజీ09ఈ999 నంబర్‌ను ఈకో డిజైన్ స్టూడియో రూ.99,999కి దక్కించుకుంది.
సినిమా విషయానికి వస్తే.. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.