యువ హీరోలు సైతం ఆశ్చర్యపోయే ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బాక్సాఫీస్ పై దండయాత్రం చేసేందుకు రెడీ అంటున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna). ఈ నందమూరి హీరో ఎప్పటికపుడు అభిమానుల అభిరుచులకు అనుగుణంగా వారికి కావాల్సిన వినోదాన్ని అందించేందుకు ప్రిపేరవుతూ ఉంటాడని తెలిసిందే.
తాజాగా వీరసింహారెడ్డిగా అలరించేందుకు రెడీ అవుతూనే.. మరోవైపు కామిక్ టచ్ ఉన్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఎన్బీకే108 కూడా లాంఛ్ చేశాడు. 60 ప్లస్‌లో కూడా ఏ మాత్రం తగ్గేదేలే.. నో రెస్ట్.. ఓన్లీ మూవీస్ అంటూ దూసుకెళ్తున్నాడు. తాజా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బాలకృష్ణ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఆదిత్య 369.
అయితే బాలకృష్ణ త్వరలో ఆదిత్య 999 (Aditya 999) టైటిల్‌తో కొత్త సినిమా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజా వార్తల ప్రకారం ఫిబ్రవరిలో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడట. అంతేకాదు అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇదే సినిమాతో ఉండబోతుందని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇందులో మోక్షజ్ఞ (Mokshagna) కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. నందమూరి కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయే స్కిల్స్ ను నేర్పించే పనిలో బాలకృష్ణ ఉన్నాడని ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం. మొత్తానికి కొత్త సంవత్సరంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తాజా అప్డేట్తో అర్థమవుతుంది.