హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘వీరమాస్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం దాదాపు తుదిదశకు చేరుకున్నది.
ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నది వినికిడి. బాలకృష్ణ 109వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సంక్రాంతి విజయాలు బాలయ్యకు కొత్తకాదు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ ఖాయమైతే నందమూరి అభిమానుల్లో పండగే. ఊర్వశీ రౌతేలా, ఛాందినీ చౌందరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్గా కనిపించనున్న విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకుడు.