NBK 109 | బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఈ స్టార్ హీరో ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్లో NBK 109 సినిమా చేస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో ఇప్పటికే షురూ అయినట్టు అప్డేట్ కూడా వచ్చిందని తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. ఇందులో పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నట్టు కూడా చెప్పింది. తన పాత్ర కోసం పాపులర్ బాక్సర్ Conor McGregorతో ట్రైనింగ్ సెషన్లో ఉన్న స్టిల్‌ను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఊర్వశి రౌటేలా. ఆ తర్వాత స్కందలో కల్ట్ మామ సాంగ్‌లో ఇరగదీసింది. ఇప్పుడు హీరోయిన్గా ఫుల్ లెంగ్త్ రోల్లో అలరించేందుకు రెడీ అవుతుండటంతో సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది. బాబీ (Bobby) ఈ సినిమాలో బాలయ్య కోసం మూడు నుంచి నాలుగు కొత్త లుక్స్‌ను డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ.. తన కొత్త సినిమాలో బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.