Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో బాలయ్య డాకు మహరాజ్ పాత్రతో పాటు నానాజీ అనే డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ యాక్షన్ వోల్టేజీతో ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే బాలయ్య మరో హిట్ కొట్టబోతున్నాడని తెలుస్తుంది.