బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్ ఇది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదవడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. తదుపరి షెడ్యూల్ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను హిమాలయాల్లో లొకేషన్ రెక్కీ చేస్తున్నారు. అక్కడి సుందరమైన ప్రదేశాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదలకానుంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.