‘అఖండ 2’ను ఎట్టిపరిస్థితుల్లో దసరాకి తీసుకొచ్చేయాలనే కసితో వర్క్ చేస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. దానికి తగ్గట్టే జెట్ వేగంతో షూటింగ్ జరుగుతున్నది. మరోవైపు అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌ని కూడా కానిచ్చేస్తుండటం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు బోయపాటి. మరోవైపు ఏకకాలంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌కి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతున్నది. ఇలా షూటింగ్‌తోపాటు నిర్మాణానంతర పనుల్ని కూడా కానిచ్చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
బోయపాటి బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లడమే సినిమా ఇంత వేగంగా పూర్తికావడానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారు. దుష్టసంహారం అనంతరం వారణాసికి వెళ్లిపోయిన అఖండ రుద్ర సికిందర్ అఘోరా.. మళ్లీ తిరిగి ఎందుకొచ్చాడు? ఎవర్ని రక్షించేందుకు తిరిగొచ్చాడు? ఎవర్ని ఎలా శిక్షించాడు? అనేదే సినిమా కథ. ‘అఖండ’కు నెక్స్ లెవల్లో సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. తమన్ స్వరాలందిస్తున్నారు. తేజస్వినీ నందమూరి సమర్పకురాలు.