వరుసగా నాలుగు విజయాల తర్వాత అయిదో సక్సెస్ కోసం ‘అఖండ 2 – తాండవం’తో రాబోతున్నారు అగ్రహీరో నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. బాలయ్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే తెలుగుతోపాటు హిందీ డబ్బింగ్ కూడా బాలకృష్ణ పూర్తిచేసేశారట. ఇదిలావుంటే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
గురువారం హైదరాబాద్‌లో చివరి పాట చిత్రీకరణ మొదలైంది. కథలో కీలక సమయంలో వచ్చే ఈ పార్టీ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ తొలివారంలో సినిమా విడుదల కానుంది. సమయం కావాల్సినంత ఉండటంతో నిర్మాణానంతర కార్యక్రమాలను కూల్‌గా ముగించనున్నారు. సంయుక్త మీనన్, ప్రగ్యా జైశ్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజస్వినీ నందమూరి సమర్పకురాలు.