‘బలగం’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు యెల్దండి. రక్త సంబంధాల గొప్పతనాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో వేణు యెల్దండి తాజా చిత్రం ‘ఎల్లమ్మ’ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఈ సినిమా తాలూకు అప్డేట్ను సోషల్‌మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు వేణు యెల్దండి. సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం ‘ఎల్లమ్మ’ సినిమా ప్రకటనతో పాటు గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ద్వారా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. గురువారం రిలీజ్ చేసే గ్లింప్స్‌తో ఈ సినిమా తాలూకు పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.